తన పేరుని వాడుకొని కొందరు మోసాలకి పాల్పడుతున్నట్లు వెల్లడించారు చాందినీ చౌదరి. ఈ మేరకు నెటిజన్లను అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ''కొద్ది నెలలుగా నాతో పాటు నా కోలీగ్స్ ఫొటోలు, పేర్లు ఉపయోగించి మోసానికి పాల్పడుతున్నారు. ఇంటర్నేషనల్ నంబర్ల ద్వారా వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతూ ఇన్‌ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇతరత్రా పర్సనల్ సమాచారాన్ని పొంది ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తున్నారు’ మీకు ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి. అలాగే మీ వివరాలను వాళ్లతో పంచుకోకండి’’ అని చాందినీ సూచించారు.
షార్ట్ ఫిలింస్‌లో నటించడం ద్వారా పాపులర్ అయ్యారు చాందిని చౌదరి. రాజ్ తరుణ్‌తో ఆమె నటించిన ‘ది బ్లైండ్ డేట్’ షార్ట్ ఫిలిం తనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 2020లో తను హీరోయిన్‌గా నటించిన ‘కలర్ ఫొటో’ సినిమాకి జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఈ మధ్య వచ్చిన 'సమ్మతమే' సినిమాలో హీరోయిన్ గా నటించింది.