'వ్యూహం'లో చిక్కుకున్న ఆ ఇద్ద‌రు హీరోయిన్లు ఎవ‌రు?

By iQlikMovies - April 15, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాత‌. 'వ్యూహం' అనే పేరు ప్ర‌చారంలో ఉంది.

 

ఇందులో నాని పాత్ర‌లో నెగిటీవ్ షేడ్స్ క‌నిపిస్తాయ‌ని స‌మాచారం. నాని, సుధీర్ బాబు.... ఇద్ద‌రూ గ‌తంలో ఇంద్ర‌గంటితో ప‌నిచేసిన వాళ్లే. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ల‌ను కూడా ఫిక్స్ చేసేశార‌ని తెలుస్తోంది. నాని ప‌క్క‌న నివేదా థామ‌స్‌, సుధీర్ ప‌క్క‌న అతిథిరావు హైద‌రీ న‌టించ‌నున్న‌ట్టు టాక్‌.  నాని - నివేదా ఇది వ‌ర‌కు 'నిన్ను కోరి'లో జంట‌గా క‌నిపించారు. 

 

సుధీర్ - అతిథి రావు 'స‌మ్మోహ‌నం' కోసం జోడీ క‌ట్టారు. ఈ హిట్ కాంబినేష‌న్‌ని మ‌ళ్లీ రిపీట్ చేస్తున్నార‌న్న‌మాట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈలోగా పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కువ‌స్తాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS