అమలాపాల్ న్యూడ్ టీజర్ ఈ మధ్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళంలో అమలాపాల్ నటిస్తున్న 'అడాయ్' చిత్రం కోసం ఆమె న్యూడ్‌గా నటించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమాని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు అమలాపాల్ న్యూడ్ సీన్‌లో నటించిందట. స్టోరీ డిమాండ్ చేయడం వల్ల సినిమాలో ఆ సీన్ పెట్టక తప్పలేదట.
కానీ, ఆ సీన్‌లో నటించేందుకు అమలాపాల్ పూర్తి సహకారం అందించిందనీ, చిత్రయూనిట్ తెలిపింది. అయితే, ఇంత సెన్సేషనల్ అయిన ఆ సీన్‌లో అమలాపాల్ నిజంగా న్యూడ్‌గా నటించలేదనీ, సెకండ్ స్కిన్ ధరించిందనే ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టేలా అమలాపాల్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆ సీన్‌లో నటించడానికి చాలా చాలా భయపడ్డాను. కానీ, అందరూ అనుకుంటున్నట్లు ఎలాంటి సెకండ్ స్కిన్ ధరించలేదు. నిజంగానే న్యూడ్‌గా నటించాను.. దర్శక, నిర్మాతలు మరీ ఇబ్బందిగా ఉంటే, ప్రత్యేకమైన దుస్తులు ధరించమని సూచించారు కానీ, కథ కోసం రిస్క్ చేసినా తప్పు లేదనిపించింది. ఆ కథ అలాంటిది. అందుకే నిజంగానే న్యూడ్‌గా నటించా.
15 మంది మధ్యన చాలా జాగ్రత్తగా ఆ సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో సెట్‌లో యూనిట్ చాలా హుందాగా వ్యవహరించారనీ, ఆ నమ్మకంతోనే ఆ సీన్లలో నటించేందుకు ఒప్పుకున్నాననీ అమలాపాల్ తెలిపింది. అలా న్యూడ్ సీన్‌లో నటించినందుకు అమలాపాల్ కొన్ని విమర్శలతో పాటు, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎంతో ధైర్యం ఉంటే కానీ, అలాంటి సీన్లలో నటించడం సాధ్యం కాదనీ ఆమెపై కొందరు ప్రశంసల జల్లు కురిపించారు. అమలాపాల్ కష్టం ఫలించాలంటే, సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి తీరాలి. ఏమో ఏం జరుగుతుందో చూడాలి మరి.