విజయ్ దేవరకొండ నుండి రౌడీస్ (ఆయన అభిమానులు) ఏం ఆశిస్తారో అందరికీ తెలుసు. అవన్నీ, జాగ్రత్తగా మిక్స్ చేసి 'డియర్ కామ్రేడ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని తీసుకురాబోతున్నారు. విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ అతనికి పెద్ద ప్లస్ పాయింట్. అదే నిర్మాతలకు పెద్ద అడ్వాంటేజ్. అందుకే ఆ సినిమాలో ఆ ఆటిట్యూడ్‌ని ఇంకా గట్టిగా వాడేసినట్లున్నారు.
ఆల్రెడీ 'గీత గోవిందం' సినిమాతో భీభత్సమైన రొమాంటిక్ కెమిస్ట్రీని పండించేశారు విజయ్, రష్మిక. అప్పుడు గీత, గోవిందం.. ఇప్పుడు లిల్లీ, బాబీ. లిప్ టు లిప్ కిస్‌లు చాలా గట్టిగా లాగించేశారు. ట్రైలర్‌కి ఆ లిప్‌కిస్‌లే పెద్ద హైలైట్. కాలేజీ గొడవలు మామూలే. ఓవరాల్‌గా రౌడీస్ కాలర్ ఎగరేసుకు తిరిగేలా ఉందీ ట్రైలర్. డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకటేంటీ అన్నీ సమపాళ్లలో రంగరించినట్లే కనిపిస్తోంది. వంద కోట్ల టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాతో. జూలై 26న 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తం నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ సినిమా.