'సీటీమార్‌'తో గోపీచంద్‌ చితక్కొట్టేశాడంతే!

మరిన్ని వార్తలు

సంపత్‌ నంది - గోపీచంద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి తాజాగా టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. 'సీటీమార్‌' అనే పక్కా మాస్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. కబడ్డీ నేపథ్యంలో సాగే చిత్రమిది. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో గోపీచంద్‌ ఆసక్తికరమైన లుక్స్‌లో కనిపిస్తున్నాడు. లేడీ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా గోపీచంద్‌ నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్నా పాత్రను కూడా కబడ్డీ కోచ్‌గానే డిజైన్‌ చేశాడు దర్శకుడు సంపత్‌ నంది. సంపత్‌ నంది సినిమాల్లో మాస్‌ పల్స్‌ ఎక్కువగా కనిపిస్తుంది. క్రీడా నేపథ్యం అందులోనూ మాస్‌లో క్రేజ్‌ ఉన్న కబడ్డీ నేపథ్యం కనుక ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి.

 

ఇటీవల క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలు బాగానే సక్సెస్‌ అవుతున్నాయి. ఆ కోవలో 'సీటీమార్‌' కూడా సక్సెస్‌ అయితే, గోపీచంద్‌ బౌన్స్‌బ్యాక్‌ అవ్వడం ఖాయం. గతంలో గోపీచంద్‌, సంపత్‌ నంది కాంబినేషన్‌లో వచ్చిన 'గౌతమ్‌ నందా' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమాతో సంపత్‌ నంది, గోపీచంద్‌కి ఎలాగైనా హిట్‌ ఇవ్వాలన్న కసితో ఉన్నాడట. ఫస్ట్‌లుక్‌కీ, టైటిల్‌కీ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చూడాలి మరి, ఫ్యాన్స్‌తోనూ గోపీచంద్‌ 'సీటీమార్‌' అనిపిస్తాడేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS