లాక్ డౌన్ తరవాత.. థియేటర్లు తెరచుకున్నాయి. సినిమాలూ వస్తున్నాయి. కానీ జనాలే ఇంకా థియేటర్లకు రావడానికి జంకుతున్నారు. మంచి మాస్ సినిమా పడితే గానీ, జనాలు రారేమో అనుకుంటున్న దశలో `సిటీమార్` విడుదల అవుతోంది. గోపీచంద్, తమన్నా జంటగా నటించిన సినిమా ఇది. సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఈనెల 10న రిలీజ్ కానుంది. థియేటరికల్ రైట్స్ రూ.16 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాక్. ఈమధ్య కాలంలో ఇంత రేటు పలికిన సినిమా ఇదే.
కాకపోతే.. ఈసినిమాకి 16 కోట్లు చాలవు. ఎందుకంటే... సినిమా బడ్జెట్టే 40 కోట్లు అయ్యింది. అంటే.. ఇంకో 26 కోట్లు రావాలి. ఓటీటీ, హిందీ డబ్బింగ్, శాలిలైట్ పైనే సిటీమార్ ఆశలు పెట్టుకుంది. ఈ మూడింటి రూపంలో.. కనీసం 20 కోట్లయినా వస్తుందని లెక్క. అంత రావాలంటే.. ముందు సిటీమార్.... థియేటర్లలో మార్మోగిపోవాలి. అప్పుడుగానీ డిజిటల్ రైట్స్ కి గిరాకీ రాదు. గోపీచంద్ కి చాలాకాలంగా హిట్స్ లేవు. బయటేమో పరిస్థితులు బాలేవు. ఇలాంటి తరుణంలో సిటీమార్ గట్టెక్కాలంటే అద్బుతాలు జరగాల్సిందే.