భారతీయుడు ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై ఉంటుందా?

మరిన్ని వార్తలు

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీ నిరాశ పరచటంతో, శంకర్ మార్క్ ఎక్కడా కనిపించక పోవటంతో ఫాన్స్ అసహనానికి లోనయ్యారు. ఇంచుమించు ఐదేళ్లు అయ్యింది ఈ మూవీ స్టార్ట్ చేసి. ఎట్టకేలకి రిలీజ్ కి నోచుకుంది.  కానీ నిరాశ ఎదురయ్యింది. శంకర్ ని అంతా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్‌ సినిమా గూర్చి అందరిలో టెన్షన్ మొదలయ్యింది. శంకర్ టేకింగ్ పై చెర్రీ ఫాన్స్ ఆశలు వదిలేసుకున్నారు . హిట్ మాట దేవుడెరుగు చెత్త రికార్డ్ రాకుండా ఉంటే చాలని వాపోతున్నారు.
 

ఇప్పటికే శంకర్ పై పలు ట్రోల్స్ వస్తున్నాయి. భారతీయుడు2 సినిమా ప్రమోషన్స్ లో శంకర్ గేమ్ ఛేంజర్ గురించి చెప్తూ  మాస్ మసాలా మూవీ అని పేర్కొన్నారు. శంకర్ మూడు సంవత్సరాల పాటు కష్టపడి మాస్ సినిమా తీశారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు భారతీయుడు 2 ప్లాఫ్ మరింత కునుకు లేకుండా చేసింది మెగా ఫాన్స్ కి. గేమ్ చేంజర్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అసలు షూటింగ్ కంప్లీట్ అయ్యిందో లేదో కూడా తెలియదు. చెర్రీ డేట్స్ అని వేస్ట్ చేసేసాడు శంకర్. తోటి హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకెళ్తుంటే చెర్రీ మాత్రం గేమ్ చేంజెర్ దగ్గరే ఆగిపోయాడు.


ఇప్పుడేమో భారతీయుడు జనాల్ని ఆకట్టుకోలేక పోయింది. శంకర్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ టైంలో గేమ్ చేంజెర్ రిలీజ్ కావటం కూడా మంచిది కాదని, ఇప్పుడైనా గేమ్ చేంజెర్ ని సరి చూసుకోవాలని, ఏమైనా లోపాలుంటే రి షూట్ చేసుకుని అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాక రిలీజ్ చేస్తే, చరణ్ మార్కెట్ వాల్యూ ప్రకారం పాజిటీవ్ టాక్ రావచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేదా భారతీయుడి లా ఎదో మొక్కు బడిగా రిలీజ్ చేయాలనీ చూస్తే భారీ నష్టం తప్పదు. ఇక తెలుగు హీరోలెవరు శంకర్ వైపు చూసే సాహసం చేయరు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS