బ‌న్నీ పాట పాడాడోచ్‌!

By Gowthami - October 26, 2019 - 12:42 PM IST

మరిన్ని వార్తలు

త‌న హీరోల‌తో పాట‌లు పాడించే అల‌వాటు త‌మ‌న్‌కి ఉంది. చాలామంది హీరోల్ని సింగ‌ర్లుగా మార్చాడు. ఇప్పుడు ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో `అల వైకుంఠ‌పుర‌ములో` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని `రాములో రాములా` పాట ఈ రోజు విడుదల కాబోతోంది. ఈ పాట‌లో బ‌న్నీ గొంతు కూడా వినిపించ‌నుంది.

 

త్రివిక్ర‌మ్ ఈ పాట‌కు ముందు మాట‌లా కొన్ని ప‌దాలు రాశార్ట‌. ఆ ప‌దాల‌న్నీ బ‌న్నీ గొంతు నుంచి వినిపించ‌నున్నాయి. `రాములో రాములా` మంచి మాస్ బీట్ అన్న సంగ‌తి విన‌గానే అర్థ‌మైంది. బ‌న్నీ మంచి స్టెప్పులు వేయ‌డానికి అనువుగా ఈ పాట‌ని త‌మ‌న్ కంపోజ్ చేసి పెట్టాడు. దానికి తోడు బ‌న్నీ గొంతు కూడా ఈ పాట‌కు అద‌న‌పు హంగులు తీసుకురానుంది. మ‌రి ఈ పాట ఏ రేంజులో ఉంటుందో తెలియాలంటే.. ఈ సాయింత్రం వ‌ర‌కూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS