ఈమధ్య పార్ట్ 2, సీక్వెల్‌ల సంప్రదాయం జోరుగా సాగుతోంది. ఓ సినిమా హిట్టయితే.. సీక్వెల్ కి రంగం సిద్ధం చేసేస్తున్నారు. కొన్ని సినిమాలకైతే.. ఓకే కథని రెండు భాగాలుగా తీసేస్తున్నారు. ఇప్పుడు లైగర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉందట. పూరి - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం `లైగర్`. ఈనెల 25న వస్తోంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉందట. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. ''లైగర్‌కి సీక్వెల్ ఉంది. అయితే.. దానికి కొంచెం సమయం పడుతుంది. ప్రస్తుతం `లైగర్` రిజల్ట్ పై ఫోకస్ చేశాం. జగనణమన, ఖుషి అయ్యాక.. సుకుమార్‌తో ఓ సినిమా చేస్తున్నా. వాటి తరవాత మళ్లీ పూరితోనే సినిమా ఉంటుంద''ని స్పష్టం చేశాడు విజయ్ దేవరకొండ.
పూరి కెరీర్‌లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లూ ఉన్నాయి. అయితే దేనికీ సీక్వెల్ రాలేదు. కొత్త కథని చెప్పడమంటేనే పూరికి ఇష్టం. అలాంటిది.. ఇప్పుడు `లైగర్`కి సీక్వెల్ చేస్తానంటున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే. ఒకటి మాత్రం నిజం `లైగర్` హిట్టయితేనే... సీక్వెల్ గురించి ఆలోచించాలి. లేదంటే లేదు. మరోవైపు `జగనణమన` కూడా ఉంది. `లైగర్` ఎంత హిట్టయినా అప్పటికప్పుడు సీక్వెల్ చేయలేరు. `జనగణమన` కూడా రావాలి. అప్పటి వరకూ సీక్వెల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.