ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ ఓ కొత్త మెసేజ్ ఇచ్చింది. అందం అంటే గ్లామర్ మాత్రమే కాదు ఆత్మ విశ్వాసం అంటోంది. గ్లామర్ అంటే తెల్ల తోలుకి మాత్రమే సంబంధించింది కాదు, గ్లామర్ రంగంలో ఎవరైనా వెలుగు వెలగొచ్చు అని చాటి చెప్పింది. అంగాంగ ప్రదర్శన చేయడమే గ్లామర్ అనుకుంటే పొరపాటే అంటూ ప్రెగ్నెంట్ అయిన తన న్యూడ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సరికొత్తగా తన సత్తా చాటింది సెరీనా. ప్రస్తుతం ఈ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టెన్నీస్‌లో ఎనిమిది సార్లు వరల్డ్ వైడ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలబడింది సెరీనా. ఈ నల్లకలువ చెప్పిన గ్లామర్ మెసేజ్ భలే ట్రెండింగ్ అవుతోంది ఇప్పుడు సోషల్ మీడియాలో.