'సెక్సీ' అనేది ఆటిట్యూడ్ తప్ప, శరీరానికి సంబంధించినది కాదంటూ అనసూయ కొత్త అర్థం చెప్పింది. కానీ 'సెక్సీ' అన్న మాటకి రియల్ అర్థం వేరు. ఆ అర్థం అనసూయకీ బాగా తెలుసు. అయితే ఈ కొత్తర్ధం ఎందుకు చెప్పిందో కానీ, ఏదో ఒక రకంగా తన ఊసు న్యూస్‌లో ఉండేలా చూసుకుంటూ ఉంటుంది సెక్సీ యాంకర్ అనసూయ. బుల్లితెరపై హాట్ అండ్ సెక్సీ బ్యూటీ ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు అనసూయదే. అంతలా ఈ ముద్దుగుమ్మ పాపులర్ అయిపోయింది. బుల్లితెరపై ఆమె ఒలకబోస్తున్న గ్లామర్ అలాంటిది మరి. ఆంటీ అయినా కానీ అస్సలు ఒప్పుకోదు. ఒప్పుకోవడమేంటి అనసూయకి చాలా కోపమొచ్చేస్తుంది కూడా ఆ మాటంటే. ఏది ఏమైనా ఎవ్వరేమన్నా ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా గ్లామరస్‌గా కన్పించడమే తన టార్గెట్ అంటోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా, సెక్సప్పీల్, సెక్సీ అన్న మాటలు తన నోటితో చెప్పాలంటే ఆమెకి కొంత ఇబ్బందికరంగా అన్పిస్తాయట. అందుకే ఆ మాటలకి ఇలా కొత్త అర్థం చెప్పింది. ఈ అర్థం ఎంతమందికి అర్థమవుతుందిలెండి? ఈ సంగతి పక్కన పెడితే, అమ్మడు మొన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో ఐటెం సాంగ్‌లో చిందేసింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్‌తో 'రంగస్థలమ్' సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. మొత్తానికి హాట్ హాట్ న్యూసే కాదండోయ్ అనసూయ హాట్ హాట్ ఆఫర్స్‌ని అందుకోవడంలోనూ ముందు వరసలోనే ఉంటుంది.