Saakini Daakini: శాకిని డాకిని ట్రైలర్ రివ్యూ : అమ్మాయిని చూస్తే అమ్మోరు గుర్తుకు రావాలి

మరిన్ని వార్తలు

నివేదా థామస్‌ , రెజీనా కసాండ్రా కలిసి నటించిన చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. శిక్షణ కోసం పోలీసు అకాడమీలో చేరిన ఇద్దరమ్మాయిల కథతో ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌, డ్రామా, హాస్యం మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఇద్దరి కథానాయికల లుక్స్‌, యాక్షన్ దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈగ్ హార్వెస్టింగ్ అనే క్రైమ్ చుట్టూ ఈ కథ ఉండబోతుంది.

 

ప్రతి అమ్మాయిని చూస్తే అమ్మోరు గుర్తుకురావాలనే డైలాగ్ చివరలో ఆకట్టుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS