నిన్నటిరోజున బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 52వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి దేశ నలుమూలల నుండి ఆయన అభిమానులు ముంబైకి వస్తూనే ఉంటారు.
దీనితో ఆయన ఇంటి (మన్నత్) వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడుతారు. ఇక నిన్న కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఈ సమయంలోనే తోపులాట కూడా జరగడం అప్పుడే పలువురు క్రిందపడిపోవడం కూడా జరిగాయి.
ఈ తోపులాటలో పలువురి ఫోన్లు పోవడం కొందరికి గాయాలు కూడా అవ్వడం జరిగింది. దీనితో తమ ఫోన్లు పోగొట్టుకున్న సదరు అభిమానులు స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మొత్తానికి షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.