అల్లుడూ లెట్స్‌ డూ కుమ్ముడు.!

By iQlikMovies - September 08, 2018 - 16:39 PM IST

మరిన్ని వార్తలు

నాగచైతన్య ఈసారి పెద్ద హిట్‌ కొట్టేలానే ఉన్నాడు 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాతో. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాని సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ఇప్పటికే ఈ సినిమాని నాగార్జునకు, నాగచైతన్యకు అత్యంత సన్నిహితులైన కొందరు చూశారట. పోజిటివ్‌గా వారి ఒపీనియన్స్‌ని బయట పెడుతున్నారు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఫుల్‌ ఫ్లెడ్జ్‌డ్‌ కామెడీతో మారుతి అదరగొట్టేశాడనీ అంటున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కెవ్వు కేక పుట్టించేలా ఉన్నాయట. అత్తా అల్లుళ్ల మధ్య ఛాలెంజింగ్స్‌ చాలా పవర్‌ఫుల్‌గానూ, గత చిత్రాల్లో చిరంజీవి నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' తదితర చిత్రాల్లో అత్తతో అల్లుడు ఆడుకునే సన్నివేశాలు ఎలా అయితే అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయో అదే మాదిరి ఈ జనరేషన్‌ ఆడియన్స్‌ని కట్టిపడేసేలా ఉన్నాయట. 

హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌ గ్లామర్‌ సినిమాకి మరో హైలైట్‌ కానుందట. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే అలరిస్తున్నాయి. అదే రోజు సమంత నటిస్తున్న 'యూటర్న్‌' చిత్రం కూడా విడుదల కానుంది. కానీ ఈ రెండు సినిమాలు టోటల్‌గా డిఫరెంట్‌ జోనర్‌లో రూపొందుతున్నవే కావడంతో రెండు సినిమాలూ క్లాష్‌ అయ్యే ఛాన్స్‌ లేదని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట.

 

చూడాలి మరి బాక్సాఫీస్‌ వద్ద ఈ ఇద్దరి పోరు ఎలా ఉండబోతోందో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS