రాంగోపాల్ వర్మ ని ఇమిటేట్ చేయడం షకలక శంకర్‌కి బాగా తెలుసు. అలా ఇమిటేట్ చేసే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏకంగా రాంగోపాల్ వర్మగా మారిపోయాడు. వర్మపై `పరాన్న జీవి` అనే ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ సూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆర్జీవీగా షకలక శంకర్ కనిపిస్తున్నాడు.
పవన్ అభిమానులు.. వర్మపై కౌంటర్ వేయడానికి తీస్తున్న సినిమా ఇది. శంకర్ కూడా పవన్‌కి అభిమానినే. ఆ ఇష్టాన్ని ఇలా చూపించుకుంటున్నాడన్నమాట. అన్నట్టు షకలక `డే రా బాబా` అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇది కూడా వర్మపై సెటైరే. ఈ వెబ్ సిరీస్‌లోనూ వర్మకి డూప్‌లా నటిస్తున్నాడు షకలక శంకర్. చూస్తుంటే... వర్మపై పేటెంట్ హక్కులన్నీ ఈ శంకరుడే లాగేసుకున్నట్టు కనిపిస్తోంది కదూ.