పవన్ పేరు వినగానే రెచ్చిపోయిన జబర్ధస్త్ కమెడియన్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇటు చిత్ర పరిశ్రమతో పాటు అటు రాజకీయ పార్టీలకతీతంగా కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. దానితో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టాక అందులో విజయం సాధించాలి అని అందరూ కోరుకుంటున్నారు.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా పేరుపొందిన జబర్దస్త్ ఫేం షకలక శంకర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా పవన్ పైన అవ్వడంతో వాటికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే- పవన్ కళ్యాణ్ తన మెడలో ఎర్రటి టవల్ ని ఎక్కువగా ఎందుకు వేసుకుంటారు? మీరు ఆయనతో నటించారు కదా మీకు ఏమైనా ఆ విషయం తెలుసా అని ప్రశ్నించగా- శంకర్ సమాధానమిస్తూ.. అది ఫ్యాషన్ కోసం కాదండి.. ఎరుపు అంటేనే విప్లవంకి చిహ్నంగా చూస్తారు. అందుకే ఆయన ఈ సమాజం లో మార్పు కోసం ఆ ఎర్రటి టవల్ ని ధరిస్తాడు అని అయినా అది ధరించాలి అన్నా కూడా ఒక అర్హత కావాలి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక భవిష్యత్తులో మరోసారి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు అని అడిగితే- ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అవుతుండగా ఇంకెందుకు సినిమాల్లో నటిస్తారు అని అన్నాడు.

దీనితో ఆయన CM అవ్వడం ఖాయం అంటూ ఘంటాపథంగా చెప్పాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS