శంకర్ హీరోగా కొత్త చిత్రం '2+1'.

మరిన్ని వార్తలు

శంకర్ హీరోగా కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎస్ .కె. పిక్చర్స్ , ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా సురేష్ కొండేటి , ఎడవెల్లి వెంకట్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న చిత్రం 2+1. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను దసరా కానుకగా మరియు ప్రముఖ నిర్మాత సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా ఆరవ తేది ఆదివారం (రేపు) విడుదల చేస్తున్నారు. ఈ సందర్బముగా చిత్ర దర్శకులు కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ "అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకునే అంశాలతో శంకర్ ను, రెండు విభిన్నమయిన పాత్రలతో ఈ సినిమాలో చుపించబోతున్నాము ముఖ్యంగా మాస్ క్యారెక్టర్ తో పాటుగా క్లాస్ టచ్ ఉన్న స్టూడెంట్ పాత్రలో కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

 

మరో పది సంవత్చరాల పాటు గుర్తుండిపోయే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు ఈ సినిమాలో శంకర్ పోషించారు. దర్శకుడిగా నా మొదటి సినిమాకు శంకర్ లాంటి మంచి హీరో దొరకడం ,ప్రతిస్టాత్మకమైన ఎస్ .కె. పిక్చర్స్ సంస్థ సురేష్ కొండేటి గారు నూతన నిర్మాణ సంస్థ ఆకృతి క్రియేషన్స్ ,ఎడవెల్లి వెంకట్ రెడ్డి గార్లు నన్ను నమ్మి దర్శకుడిగా అవకాశం ఇవ్వడం నా అదృష్టం" అన్నారు.

 

హీరో శంకర్ మాట్లాడుతూ " నన్ను కొత్త యాంగిల్ లో చూపించబోతున్న దర్శకుడు గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మల్లి శంభో శంకర సినిమా తర్వాత ఎస్ .కె. పిక్చర్స్ బ్యానర్ లో సురేష్ కొండేటి గారితో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మంచి ప్రొడక్షన్ వాల్యూతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నా కేరియర్ లో బెస్ట్ సినిమాగా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నూతన నిర్మాణ సంస్థ ఆకృతి క్రియేషన్స్ ఎడవెల్లి వెంకట్ రెడ్డి గారు సహకరించడం సంతోషంగా ఉంది" చెప్పారు .


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS