మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కుతుందట అనే వార్త ఈ మధ్య హల్‌చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంగా ఈ వార్తను సమర్ధించినట్లుగానే అనిపిస్తోంది. లేటెస్ట్‌గా 'సైరా' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ప్రశ్న డైరెక్ట్‌గా చిరంజీవినే అడిగేశారు మన ప్రియమైన విలేఖర్లు. అందుకు చిరంజీవి నుండి ఫుల్ క్లారిటీతో సమాధానం కూడా వచ్చేసింది. ఒకవేళ నా బయోపిక్ తెరకెక్కిస్తే, అందులో చరణ్ మాత్రం నటించొద్దు.. అని చెప్పారాయన.
చరణ్ నటిస్తే, హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేస్తాడు. కానీ, చాలా సమస్యలు కూడా ఉంటాయని చిరు తెలిపారు. అయితే, ఆ బయోపిక్‌లో తన కుటుంబ సభ్యులు మాత్రమే నటించాలని కోరుకుంటున్నానంటూ తన అభిప్రాయాన్ని బయట పెట్టారు చిరంజీవి. కుటుంబ సభ్యులు అంటే, చరణ్ తర్వాత, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లున్నారు. వైష్ణవ్ తేజ్‌కి ఇంకా తెర పరిచయం కాలేదు కాబట్టి, ఆల్రెడీ అలవాటైన ముఖాలు వరుణ్ తేజ్, సాయి ధరమ్‌తేజ్.
వీరిద్దరిలోనూ నా పోలికలు చాలా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అంటుంటారు. నేను యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు వీళ్లని చూస్తే అలాగే ఉంటారు. సో వాళ్లలో ఎవరైనా నా బయోపిక్‌లో నటిస్తే నాకు ఓకే.. అని చిరంజీవి తేల్చేశారు. అంటే త్వరలోనే చిరంజీవి బయోపిక్‌కి రంగం సిద్ధమైనట్లేనేమో. ఈ సినిమా కూడా రామ్ చరణ్ నిర్మాణంలోనే రూపొందే అవకాశాలున్నాయి.