షకీలా బయోపిక్‌: ఇదిగో 'నగ్న' సత్యం.!

By iQlikMovies - November 20, 2018 - 15:23 PM IST

మరిన్ని వార్తలు

ఓ పదిలక్షలు ఖర్చుపెడితే చాలు కోటి రూపాయలు లాభం వచ్చేస్తుంది. పాతిక లక్షలు ఖర్చు పెడితే రెండు కోట్లు వెనకేసుకోవచ్చు. వారంలో మూడు రోజులు సినిమా ఆడితే చాలు. వసూళ్ల పంట పండినట్లే. ఈ ఈక్వేషన్‌ షకీలా సినిమాలకు బాగా వర్కవుట్‌ అయ్యింది. 'సి' గ్రేడ్‌ సెక్సువల్‌ కంటెన్ట్‌ షకీలా సినిమాలకు వసూళ్ల పంట పండించింది. 

పది, పదిహేనేళ్ల క్రితం మాటిది. ఆమె దెబ్బకి మలయాళ స్టార్‌ హీరోలు బెంబేలెత్తిపోయారు. ఆ షకీలా బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోందిప్పుడు. నా జీవితం తెరిచిన పుస్తకం కాదు అంటూ షకీలా ఎవరికీ చెప్పుకోలేని చీకటి సంగతుల గురించి ఆవేదన వ్యక్తం చేసేది. ఆ చీకటి కోణాలు షకీలా బయోపిక్‌లో కనిపించబోతున్నాయి. తనను వేధించిన మలయాళ సినీ ప్రముఖుల వింతలూ, విచిత్రాలు ఈ 'షకీలా' సినిమాలో ఉండబోతున్నాయి. 

ఇది నగ్న సత్యం. అందుకేనేమో షకీలా ఫస్ట్‌లుక్‌ని నగ్నంగా డిజైన్‌ చేశారు. రిచా చద్దా నగ్న దేహానికి బంగారు ఆభరణాలను అలంకరించారు. ఆ బంగారం తళుకుల వెనక చీకటి కోణాలేంటో షకీలా బయోపిక్‌లో చూడొచ్చు. 

ఈ సినిమాతో ఎవరి జీవితంలోని చీకటి కోణాలు వెలుగులోకి వస్తాయోనని మలయాళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు వస్తున్నాయి. అతి త్వరలో షకీలా బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS