నాగశౌర్యపై ఆశలు పెట్టుకున్న ముద్దుగుమ్మ

By iQlikMovies - April 07, 2018 - 07:02 AM IST

మరిన్ని వార్తలు

నాగశౌర్య - నారా రోహిత్‌ కలయికలో వచ్చిన 'జ్యో అచ్చుతానంద' సినిమా ఎప్పటికీ మర్చిపోలేం. మానవ సంబంధాలు, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య రిలేషన్‌ని ఎంతో అందంగా చక్కగా చూపించారు ఆ సినిమాలో. నాగశౌర్య, నారా రోహిత్‌ నటనతో ఆ సినిమాకి మరింత ఆకర్షణ తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చూసినా అదో రకం హాయినిస్తుంది ఆ సినిమా. అలాగే ఇప్పుడు నాగశౌర్య కొత్త సినిమా 'అమ్మమ్మగారిల్లు' కూడా అలాంటి హాయినే అందిస్తుందని అంటున్నాడు నాగశౌర్య.

ప్రతీ ఒక్కరి జీవితంలోనూ అమ్మమ్మగారిల్లు అనేది చిన్నతనంలో ఓ చెప్పలేని అనుభూతి. ఆ అనుభూతిని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించి, చిన్నతనం గుర్తొచ్చే అనుభూతిని కలిగించనున్నారట. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా నటిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? షామిలి. అదేనండీ బేబీ షామిలీనే. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బోలెడన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా తొలి సినిమా 'ఓయ్‌'తో అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో రెండో సినిమా అయిన 'అమ్మమ్మగారిల్లు' పైనే ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకుంది.

తొలి సినిమాలో కొంచెం బొద్దుగా ఎబ్బెట్టుగా కనిపించిందన్న విమర్శలు ఎదుర్కొన్న షామిలి, ఈ సినిమా కోసం స్లిమ్‌గా మరింత అందంగా మారిపోయింది. నాగశౌర్య, షామిలీ జంట కూడా చూడ ముచ్చటగా అనిపిస్తోంది. నాగశౌర్య ఈ మధ్యనే 'ఛలో' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అదే సక్సెస్‌ ఈ సినిమాతోనూ కంటిన్యూ చేస్తాడేమో చూడాలి మరి. సుందర్‌ సూర్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS