'రంగస్థలం' పండగ మళ్లీ మొదలైంది

మరిన్ని వార్తలు

రిలీజైన తొలి వీకెండ్‌ రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిన 'రంగస్థలం' రెండో వారం మొదటికి వచ్చేసరికి, సోమవారం బెటర్‌గా ఉంది. మంగళవారం వచ్చేసరికి కొద్దిగా స్లో అయ్యింది. బుధవారానికి ఇంకొంచెం స్లో అయ్యింది. మళ్లీ గురువారం వచ్చేసరికి జోరందుకుంది. గురువారానికి దాదాపు అన్ని చోట్లా హౌస్‌ఫుల్స్‌ నమోదయ్యాయి. దాంతో రెండో వీకెండ్‌ కూడా 'రంగస్థలం' వసూళ్లు దాదాపు హై స్థాయిలో ఉండొచ్చనే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 130 కోట్లు వసూళ్లు కొల్లగొట్టిందనీ ట్రేడ్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

కేవలం 7 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన తొమ్మిదో తెలుగు చిత్రంగా 'రంగస్థలం' రికార్డు సాధించింది. ఇక రేపట్నుంచీ వీకెండ్‌ స్టార్ట్‌ కానుంది. ఈ వీకెండ్‌లో ఖచ్చితంగా వసూళ్లు పెరగనున్నాయనీ, టికెట్‌ హౌస్‌ఫుల్స్‌ చూస్తుంటేనే తెలుస్తోంది. చిట్టిబాబు అంతలా మెప్పించేస్తున్నాడు. ఒకసారి చూస్తే తనివి తీరడం లేదు చిట్టిబాబుని. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాడు. అందుకే 'రంగస్థలం' వసూళ్లు ఈ రేంజ్‌లో ఉన్నాయి మరి. ఒక్క చిట్టిబాబునే కాదు, రామలక్ష్మిని చూడాలని ఓ సారి, రంగమ్మత్తని చూడాలని ఇంకోసారి, 'జిగేల్‌రాణీ' వయ్యారాల కోసం మరోసారి ఆడియన్స్‌ ఈ సినిమాకి ఎట్రాక్ట్‌ అవుతున్నారు.

అంతేనా, పాటలకోసారి, ఫైట్స్‌కోసారి, చిట్టిబాబు ఎంటర్‌టైన్‌మెంట్‌కోసారి టోటల్‌గా కథా, కథనాల పట్టు ఆ రేంజ్‌లో ఉంది ఈ సినిమాకి. దాంతో ఇప్పుడప్పుడే 'రంగస్థలం' మేనియా వదిలేలా లేదు. చిట్టిబాబు ఆ రేంజ్‌లో కొట్టాడు మరి. కొడితే కుంభస్థలం అన్నట్లుగా కరువు తీరిపోతోందంతే 'రంగస్థలం'తో ఇటు బాక్సాఫీస్‌కి వసూళ్లకీ, అటు ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కీ కూడా. దటీజ్‌ 'రంగస్థలం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS