అమ్మమ్మ ఇల్లు అంటే ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఓ ముఖ్య అనుభూతి. చిన్నతనంలో అమ్మమ్మ ఇంటి అనుభూతుల్ని పొందని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకవేళ అలాంటి అనుభూతిని ఎవరైనా మిస్ అయ్యుంటే ఏం ఫీల్ అవ్వకండి. మా సినిమాని చూడండి. ఆ ఫీల్‌ని హాయిగా అనుభవించండి అంటున్నారు నాగశౌర్య అండ్ టీమ్. నాగశౌర్య - షామిలీ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'.
బేబీ షామిలీగా అందరికీ సుపరిచితురాలైన బేబీ షామిలీ 'ఓయ్' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. చిన్నప్పుడు ముద్దులొలికే మాటలతో క్యూట్‌గా ఆకట్టుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. తొలి సినిమాతోనే విమర్శలు అందుకుంది. హీరోయిన్ ఫీచర్స్ లేవంటూ, ఫిజిక్‌పై బాగా కాన్‌సన్‌ట్రేషన్ చేయాలంటూ కామెంట్స్ రావడంతో ఏమనుకుందో ఏమో కానీ, తర్వాత ఈ ముద్దుగుమ్మ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. దాంతో ప్రేక్షకులు ఈ బ్యూటీని మర్చిపోయారు. అయితే ఈ మధ్యనే మళ్లీ ఈ బ్యూటీ పేరు తెరపైకొచ్చింది.
యంగ్ హీరో నాగశౌర్యతో 'అమ్మమ్మగారిల్లు' అనే సినిమాలో నటిస్తోంది షామిలి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యిందట. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లవర్స్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఈ లుక్‌లో షామిలి కొంచెం సన్నగానే కనిపిస్తోంది. తన క్యారెక్టర్ గురించి చెబుతూ, 'నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కొత్తగాఉంటుంది. సరైన కథలు దొరక్కే ఇన్నాళ్లుగా సినిమాలు చేయలేదు.
ఇకపై వరుసగా సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాననీ..' షామిలి చెబుతోంది. చూడాలి మరి రెండో సినిమాతోనైనా షాలిని నిలదొక్కుకుంటుందో లేదో!