శంకర్ రోబోకి సీక్వెల్ గా రోబో 2 తీశాడు. ఆ తరవాత.. కథ దృష్టి భారతీయుడు పై పడింది. ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. శంకర్ దర్శకత్వం వహించిన `జెంటిల్‌మెన్` కొనసాగింపుగా జెంటిల్‌మెన్ 2 రాబోతోంది. ఈ విషయాన్ని జెంటిల్‌మెన్ నిర్మాత కుంజుమోహన్ స్వయంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్.
అయితే.. ఈ సీక్వెల్ లో అటు అర్జున్ గానీ, ఇటు శంకర్ గానీ ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న ఓ హీరో.. నటించబోతున్నారు. దర్శకత్వ బాధ్యతలు కూడా ఓ అగ్ర దర్శకుడి చేతిలో పెడతారని సమాచారం. అయితే.. అర్జున్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తార్ట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడవుతాయి.