'లవ్‌లీ' భామకు 'రాజ' యోగం పట్టనుందా.?

మరిన్ని వార్తలు

రాజుగారికి ఓ పట్టాన ఏదీ నచ్చదు. ఒకవేళ నచ్చిందంటే, అది అందరికీ నచ్చి తీరాల్సిందే. బాక్సాఫీస్‌ని షేక్‌ చేయాల్సిందే. ఇంతకీ ఎవరీ రాజుగారు అంటారా.? ఇంకెవరండీ మన దిల్‌రాజుగారు. చిన్న సినిమాల్ని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. ఆయనను మెప్పిస్తే, ఆడియన్స్‌ని మెప్పించినట్లే. అంతటి అభిరుచి గల నిర్మాత ఆయన. అయితే, ఈ మధ్య మన రాజుగారికి కూడా అంతగా కలిసి రావడం లేదనుకోండి. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టారు. తర్వాత 'మహర్షి'తో ఫర్వాలేదనిపించారు. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయనుకోండి. వాటిలో 'సరిలేరు..' కూడా ఒకటి.

 

ఇకపోతే, పవన్‌ కళ్యాణ్‌తో 'పింక్‌' రీమేక్‌ కోసం రాజుగారు తెగ తిరుగుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సంగతి అటుంచితే, జనవరి 1న ఓ డబ్బింగ్‌ చిత్రాన్ని దిల్‌రాజు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. రక్షిత్‌ శెట్టి హీరోగా శాన్వీ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రమిది. శాన్వీ అంటే ఎవరో గుర్తు పట్టారు కదా.. 'లవ్‌లీ' భామ. 'లవ్‌ లీ' తర్వాత సుశాంత్‌తో 'అడ్డా', మంచు విష్ణుతో 'రౌడీ' తదితర చిత్రాల్లో నటించింది కానీ, ఆకట్టుకోలేకపోయింది. అయితే, తన తాజా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శాన్వీ కొంత భావోద్వేగానికి లోనైన విషయం ఈ మధ్య సినీ ఫాలోవర్స్‌కి ఆ నోటా ఈ నోటా వినబడే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా తనకు అవకాశాలివ్వలేదంటూ శాన్వీ భోరున విలపించింది. దాంతో ఆడియన్స్‌నే కాదు, రాజుగారిని కూడా శాన్వీ ఎక్కడో ఎమోషనల్‌గా టచ్‌ చేసింది. సో రాజుగారు ఇకపై ఆమెకు ఏమైనా అవకాశాలిప్పిస్తారేమో. ఒకవేళ అదే జరిగితే, శాన్వీకి 'రాజ' యోగం పట్టినట్లేగా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS