తెలుగమ్మాయ్ అంజలికి స్టార్డమ్ లేకున్నా, ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగులో ఓ మోస్తరు గుర్తింపు ఉంటే, తమిళంలో ఆ స్థాయి నెక్స్ట్ లెవల్లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో తమిళంలో ఈ తెలుగు పాప ఎప్పుడూ బిజీగానే గడిపింది. ప్రస్తుతం 'నిశ్శబ్ధం' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. మరికొన్ని తమిళ ప్రాజెక్టులు సెట్స్‌పై ఉన్నాయనుకోండి. కెరీర్ సంగతి అటుంచితే, లేటెస్ట్గా మన అంజలి పాప ఓ షాకిచ్చిందండోయ్.
తమిళ హీరో జైతో అంజలి పాప పీకల్లోతు లవ్‌లో ఉంది. రేపో మాపో పెళ్లి చేసుకోబోతోందంటూ ఆ మధ్య వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు తూచ్ అదంతా ఉత్తదే.. పెళ్లీ లేదు, ప్రేమ లేదు. బ్రేకప్ అన్నారు. కానీ, ఇప్పుడు లవ్ ఏంటీ.? బ్రేకప్ ఏంటీ.? మేమిద్దరం జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ మధ్య బ్రేకప్ ఏంటీ సిరాగ్గా.. అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో లవ్ అంటూ చెట్టాపట్టాలేసుకు తిరిగి ఇప్పుడు ఫ్రెండ్స్.. అంతే అని సింపుల్‌గా తేల్చేసిన మన తెలుగమ్మాయ్ తెలివితేటలకి షాకవ్వక ఇంకేం చేస్తారు చెప్పండి. మొత్తానికి అంజలి పాప తన లవ్‌పై ఇన్నాళ్లకిలా క్లారిటీ ఇచ్చిందన్న మాట. సర్ సర్లే ఏవేవో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటీ.!