ఏదో ఏదో కావాలనుకుని హీరోయిన్ అయ్యింది ముద్దుగుమ్మ శాన్వీ. హీరోయిన్గా యాక్టింగ్ టాలెంట్, గ్లామర్ టాలెంట్, డాన్సింగ్ టాలెంట్ ఇలా అన్ని రకాల టాలెంట్స్ ప్రదర్శించినా కానీ, అమ్మడికి అసలు సిసలు హిట్టే దక్కడం లేదు. 'లవ్లీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కినేని హీరో సుమంత్‌తో 'అడ్డా'లో నటించింది. ఈ రెండు సినిమాలు శాన్వీకి హీరోయిన్గా అలా అలా గుర్తింపు తెచ్చినా కానీ, తర్వాతి అవకాశాలు అందుకునేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడలో హీరోయిన్గా నిలదొక్కుకునేందుకు తాపత్రయ పడుతోంది. అక్కడ ఓ సినిమా కోసం ఈ బ్యూటీ తెగ వర్కవుట్స్ చేసేస్తోందట. అసలే నాజూకు అందాల సుందరి అయినా ఇంకా తన శరీరాన్ని మరింత ఫ్లెక్సిబుల్ చేసేందుకు జిమ్‌లోనే ఎక్కువ టైం కేటాయించేస్తోందట. దాంతో అమ్మడి అందాలు మరింత పదునెక్కుతున్నాయి. మరి అంతటి ఆ అందాల్ని దాచుకుంటే ఎలా? అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ జిమ్ ఫిజిక్ ఫోటోలను పోస్ట్ చేసి, అందాల శాన్వి సెగలు పుట్టిస్తోందిలా.