ప్రముఖ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన్నిచెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన డయేరియాకు గురయ్యారని, డీ హైడ్రేషన్ తో బాధ పడుతున్నారని వైద్యులు తెలిపారు. దాంతో శరత్ కుమార్ ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన నెలకొంది. ఆయనకు ఎలా ఉందో? అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
అయితే.. శరత్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని శరత్ కుమార్ సన్నిహితులుతెలిపారు. ఆయన్ని కేవలం జనరల్ చెకప్ లో భాగంగానే ఆసుపత్రికి తీసుకెళ్లారని, సాయింత్రమే డిశ్చార్జ్ అయ్యారని శరత్ కుమార్ పీఆర్ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో.. శరత్ కుమార్ అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. తెలుగు, తమిళ సినిమాలతో శరత్ కుమార్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన తనయ వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం.. సినిమాలతో బిజీగా ఉన్నారు.