శర్వానంద్ డీసెంట్ యాక్టర్. తన కథల జడ్జిమెంట్ బాగుంటుంది. ఎప్పుడూ క్లీన్ సినిమాలే చేయడానికి ఇష్టపడతాడు. తన సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంటుంది. మొత్తానికి తానో ప్రామిసింగ్ స్టార్. కానీ.... ఈమధ్య శర్వా లెక్కలు తప్పుతున్నాయి. ఒకటీ, రెండు సినిమాలకంటే ఫర్వాలేదు. వరుసగా 5 ఫ్లాపులు వచ్చాయి. పడిపడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం.. ఇప్పుడు `మహాసముద్రం`... ఇలా వరుసగా 5 ఫ్లాపులు. వీటిలో శ్రీకారం ఒక్కటే కాస్తో కూస్తో వసూళ్లని తీసుకురాగలిగింది. మిగిలినవన్నీ నష్టాలనే మిగిల్చాయి.
మహా సముద్రంతో.. శర్వా కెరీర్ పెద్ద అగాధంలో కూరుకుపోయినట్టైంది. నటుడిగా శర్వాకేం ఇది కొత్త పాత్ర కాదు. పైగా తన లుక్ చాలా మారిపోయింది. బుగ్గలొచ్చేసి, లావుగానూ కనిపిస్తున్నాడు.యంగ్ హీరో ఈ లుక్ లో కనిపించడం మంచిది కాదు. చాలామంది హీరోలు రిజక్ట్ చేసిన కథ ఇది. శర్వా ఒప్పుకున్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటుందనుకుంటారంతా. కానీ కథలో విషయం లేదు.
ఇలాంటి కథని శర్వా ఎలా ఒప్పుకున్నాడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. ఎంత పెద్ద హీరోకైనా వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడితే, ఇక అంతే సంగతులు. అలాంటిది శర్వాకి ఐదొచ్చాయి. ఇప్పుడు కూడా తాను మేల్కోకపోతే, కథల విషయంలో జాగ్రత్త పడకపోతే - తన కెరీర్ మరింత ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. వేకప్.... శర్వా.