పూరి జగన్నాథ్ డైలాగులన్నీ భలే ఉంటాయి. జీవితంపై తనకంటూ ఓ ఫిలాసఫీ ఉంది. అదంతా.. తన సినిమాల్లోని పాత్రల ద్వారా చెప్పిస్తుంటాడు. `రొమాంటిక్` సినిమాలోనూ అది బలంగా కనిపించబోతోందనిపిస్తోంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్‌పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం `రొమాంటిక్`. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు మొత్తం పూరినే సమకూర్చాడు. ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందులో.. పూరి తన మార్క్ చూపించేశాడు. ఇదో రొమాంటిక్ ప్రేమకథ.
ప్రేమ, మోహం.. వీటిపై పూరి తనదైన శైలిలో పంచ్‌లేశాడు. పూరి హీరోల్లో ఓ రకమైన పెంకితనం, మొండితనం ఉంటుంది. ఆకాష్ చెప్పే మాటల్లో అది కనిపిస్తుంది. ప్రేమలో పడి మోసపోయిన అమ్మాయిలు ఏడుస్తారేమో.. మగాళ్లయితే.. వెక్కి వెక్కి ఏడుస్తారు.. అంటూ.. ప్రేమని మగాళ్లెంత సీరియస్ గా, సిన్సియర్ గా తీసుకుంటారో చెప్పేశాడు పూరి.
ప్రేమకు మరో పేరు మోహం అంటూ... చాలామంది ప్రేమించుకుంటున్నాం అనే భ్రమలో మోహించుకుంటారని - తన టిపికల్ మార్క్ చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే.. టేకింగ్ కూడా పూరి స్టైల్ లోనే సాగినట్టు అనిపిస్తోంది. కుర్రాళ్లు పండగ చేసుకునే చాలా సీన్లు, డైలాగులు ట్రైలర్లో కనిపించాయి. ఈతరానికి నచ్చితే సినిమా హిట్టే. సో.. రొమాంటిక్ కూడా... గట్టిగానే కొట్టే వీలుంది.