శర్వానంద్ - 14 రీల్స్ సంస్థ మధ్య `గొడవ` పెద్దదయ్యేలానే కనిపిస్తోంది. 14 రీల్స్ బ్యానర్‌లో శర్వానంద్ `శ్రీకారం`లో నటించాడు. ఈ సినిమాకిగానూ శర్వాకి మరో 2 కోట్ల పారితోషికం రావాల్సివుంది. ఈ 2 కోట్ల విషయంలో నిర్మాతలు చేతులెత్తేశారు. దాంతో శర్వా.. నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపాడు. నిజానికి.. శర్వానే 14 రీల్స్ కి డబ్బులు ఇవ్వాలట. శర్వా నిర్మాతగా `కో అంటే కోటి` అనే సినిమా నిర్మించాడు. అప్పట్లో 14 రీల్స్ ఓ ఏరియా అడ్వాన్స్ ప్రాతిపదికన తీసుకొంది.
అయితే ఆసినిమా ఫ్లాప్ అవ్వడంతో.. 14 రీల్స్ నష్టపోయింది. శర్వానే 14 రీల్స్ కి కొంత డబ్బు వెనక్కి ఇవ్వాల్సివచ్చింది. అయితే ఆ లెక్కలు ఇప్పటి వరకూ తేలలేదట. అయినా ఈ విషయంలో 14 రీల్స్ ఏ విధమైన రచ్చ చేయలేదు. ఆ లెక్కలు ఇప్పుడు బయటకు తీయడానికి 14 రీల్స్ సిద్ధమైందట. మరోవైపు కరోనా సంక్షోభంలో హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాల్సిందే అని `మా`, నిర్మాతల మండలి తీర్మాణించాయి. ఆ లెక్కన శర్వా `శ్రీకారం` పారితోషికం కూడా తగ్గించుకోవాలి. ఏ రకంగా చూసినా ఇప్పుడు శర్వానే నిర్మాతలకు బాకీ పడ్డాడన్నది ఇన్‌సైడ్ వర్గాల టాక్.