శర్వానందా! మజాకానా! చిన్న హీరో అయినప్పటికీ, పెద్ద హీరోలకి పోటీగా వస్తాడు. సైలెంట్‌గా హిట్ కొట్టుకెళ్లిపోతాడు. ఈ సారి కూడా అదే జరిగింది. 'మహానుభావుడు'తో వచ్చాడు. మెల్లగా హిట్‌ని జేబులో వేసేస్కున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల మందుకు వచ్చింది. ధియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. ఫస్ట్ డే టాక్ అదరిపోయింది. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి 'మహానుభావుడు'కి. 'భలే భలే మగాడివోయ్' తరహాలో డిజార్డర్ సబ్జెక్ట్‌ని పట్టుకుని దానికి వినోదం జోడించి, మళ్లీ అలాంటి హిట్‌నే కొట్టాడు మారుతి. మారుతి డైరెక్షన్‌కీ, శర్వానంద్ ఈజ్‌కీ కరెక్ట్‌గా సెట్ అయ్యింది. అదే సినిమా పోజిటివ్ టాక్‌కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ముద్దుగుమ్మ మెహరీన్ అందచందాలు, క్యూట్ హాట్‌నెస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. శర్వానంద్, మెహరీన్ జంట చూడ ముచ్చటగా ఉండడమే కాకుండా, యాక్టింగ్ టాలెంట్ ఉన్న చిన్నది కావడంతో మెహరీన్ ఈజీగా క్యారెక్టర్‌లో ఇమిడిపోయింది. 'అతిశుభ్రం' ఉన్న ఆనంద్ క్యారెక్టర్‌లో శర్వా నటన అద్భుతంగా ఉంది. ఓవర్సీస్‌లో కూడా జోరుగా దూసుకెళ్తున్నాడు శర్వానంద్. మరో పక్క 'జై లవకుశ', 'స్పైడర్' సినిమాల వసూళ్లు జోరు కొనసాగుతుండగా, తానేం తక్కువ కాదంటూ శర్వానంద్ కూడా బాక్సాఫీస్ కాసుల పంటలో తన వంతు భాగం పంచుకుంటున్నాడు. ఓపెనింగ్స్ భళా అనిపించిన 'మహానుభావుడు' లెక్కల్లో ఎంత తేల్చుతాడో చూడాలిక.