శ‌ర్వా మాసీ లుక్‌.. అదుర్స్‌

By iQlikMovies - March 06, 2021 - 10:15 AM IST

మరిన్ని వార్తలు

శ‌ర్వానంద్ అంటేనే.. ల‌వ్ స్టోరీలు, సాఫ్ట్ పాత్ర‌లూ గుర్తొస్తాయి. `మ‌హానుభావుడు` సినిమాతో పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన్‌మెంట్ పండించే పాత్ర‌లూ ఎంచుకుంటున్నాడు. త‌నుమాస్ గా క‌నిపించింది చాలా తక్కువ‌. కానీ `మ‌హా స‌ముద్రం`లో మాత్రం త‌న మాసీ కోణాన్ని చూపించ‌డానికి రెడీ అయిపోయాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. సిద్దార్థ్‌, అతిథిరావు హైద‌రీ, అనూ ఇమ్మానియేల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ రోజు... శ‌ర్వానంద్ పుట్టిన రోజు.

 

ఈ సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి శ‌ర్వా లుక్ ని విడుద‌ల చేశారు. బీచ్‌లో.. నాటు ప‌డ‌వ‌ల ప‌క్క‌న‌, చేతిలో ఆయుధంతో.. చాలా ర‌ఫ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు శ‌ర్వా. చూస్తుంటే... ఓ యాక్ష‌న్ స‌న్నివేశానికి టేకాఫ్ ఇచ్చిన‌ట్టుంది. `ఆర్‌.ఎక్స్ 100`తో చిత్ర‌సీమ దృష్టిని ఆక‌ర్షించాడు అజ‌య్ భూప‌తి. రెండో సినిమా మొద‌లెట్ట‌డానికి చాలా స‌మ‌యం తీసుకున్నాడు. అయితే మ‌హా స‌ముద్రం టైటిల్‌, అందులోని స్టార్ కాస్టింగ్, లుక్స్‌... ఇవ‌న్నీ... ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచుకుంటూ వెళ్తున్నాయి. త్వ‌ర‌లోనే ఓ టీజ‌ర్‌ని సైతం విడుద‌ల చేయ‌డానికి అజ‌య్ భూప‌తి.. రంగం సిద్ధం చేస్తున్నట్టు టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS