శర్వానంద్‌ మొదలెట్టేశాడు!

By iQlikMovies - May 25, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

సైలెంట్‌గా శర్వానంద్‌ రెండు సినిమాలను కంప్లీట్‌ చేసేస్తున్నాడు. అందులో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి కాగా, ఇంకోటి '96' రీమేక్‌. ఈ రెండు సినిమాలూ దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నాయి. రీమేక్‌ చిత్రం కాబట్టి '96'ని త్వరగానే కంప్లీట్‌ చేసేశారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయనున్నారు. ఒరిజినల్‌ తెరెక్కించిన దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ ఈ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు. శర్వా, సమంత హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాకి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదు. ఇదో విభిన్నమైన కాన్సెప్ట్‌.

 

రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో శర్వానంద్‌ కనిపించనున్నాడు ఈ సినిమాలో. యంగ్‌ క్యారెక్టర్‌ ఒకటి. మధ్య వయసు పాత్ర ఒకటి. మధ్య వయసు క్యారెక్టర్‌ డాన్‌ పాత్రనీ తెలుస్తోంది. ఇందుకోసం స్పెషల్‌ లుక్‌ కూడా ట్రై చేశాడు శర్వానంద్‌. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ లోగా విడుదల చేసిన ప్రీ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ ప్రీలుక్‌లో శర్వాతో పాటు, వెనక ఓ అరడజను మంది అనుచరులున్నారు. పవర్‌ఫుల్‌గా కనిపిస్తోందీ లుక్‌.

 

అసలు లుక్‌ రావాలంటే సాయంత్రం వరకూ వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమాలో శర్వా సరసన కాజల్‌ అగర్వాల్‌, కళ్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలైలో శర్వా నుండి ఏదో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు సినిమాలూ దాదాపు పూర్తి కావస్తుండడంతో కొద్ది నెలల గ్యాప్‌లోనే శర్వా ఈ ఏడాది రెండు సినిమాలతో సందడి చేయనున్నాడన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS