చంద్రబాబు హయాంలో ఆంధ్రపదేశ్ తెలుగు సినీ పరిశ్రమని పెద్దగా ఆకర్షించలేకపోయింది. సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు సినీ పరిశ్రమను పట్టించుకోకపోవడం చాలా మంది సినీ ప్రముఖులకు మింగుడు పడలేదు. విశాఖలో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతి కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ ఓ వెలుగు వెలుగుతుందన్నారు.
అవేమీ జరగలేదు. కానీ, ఇప్పుడు జగన్ రాజ్యం వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్ మాత్రం తెలుగు సినీ పరిశ్రమకు వరాల జల్లు కురిపిస్తారట. ఆ వరాల వివరాలు మే 30 తర్వాత తెలియనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ అద్భుతంగా వెలిగేందుకు తన గవర్నమెంట్‌లో సకల సౌకర్యాలు కల్పించనున్నాడట వైఎస్ జగన్. ప్రత్యేక రాయితీలు కూడా ఇవ్వనున్నాడట. మోహన్‌బాబు, అలీ, రోజా, ఎం.వి.వి.సత్యనారాయణ ఇలా పలువురు సినీ ప్రముఖులు వైఎస్సార్ సీపీలో ఉన్నారు.
వీళ్లలో కొందరిని ఓ కమిటీగా ఏర్పాటు చేసి, దాని ద్వారా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతారట. వాటికి అనుగుణంగా సినీ పరిశ్రమకు పెద్ద పీట వేస్తారట. జీవితా రాజశేఖర్ కూడా వైఎస్సార్ సీపీ తరపున ప్రజలకు సేవ చేసేందుకే సిద్ధంగా ఉన్నారు. జీవిత నటి, దర్శకురాలు. మోహన్‌బాబు నటుడు, నిర్మాత సో జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ రూపు రేఖలు మారిపోవడం ఖాయం. ఓ వెలుగు వెలగడం ఖాయం.