రాధ‌కు గిట్టుబాటైపోయింది

మరిన్ని వార్తలు

శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `రాధ‌`  శ‌త‌మానం భ‌వ‌తి లాంటి సూప‌ర్ హిట్ త‌ర‌వాత వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి `రాధ‌`పై అంచ‌నాలు అమాంతంగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్ర‌చార చిత్రాలూ ఆక‌ట్టుకొన్నాయి. అయితే... బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా బోల్తా కొట్టేసింది. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే శాటిలైట్‌ప‌రంగా రాధ‌కు బాగానే గిట్టుబాటు అయిన‌ట్టు స‌మాచారం. జెమినీ టీవీ ఈ సినిమాని విడుద‌ల‌కు ముందే రూ. 3.75 కోట్ల‌కు కొనేసింద‌ట‌. దాంతో... రాధ నిర్మాత‌ బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ భారీ న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డిపోయాడు.  శ‌త‌మానం భ‌వ‌తి కంటే ముందే ఈ సినిమా బిజినెస్ పూర్త‌య్యింద‌ని, శాటిలైట్‌నికూడా ఎప్పుడో అమ్మేశార‌ని, విడుద‌లైన త‌ర‌వాత అమ్ముదామంటే ఈ రేటు వ‌చ్చేది కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS