డాన్స్ మాస్టర్లు డైరెక్షన్ వైపు రావడం సహజమే. ప్రభుదేవా ఎప్పుడో డైరెక్టర్ అయిపోయాడు. లారెన్స్ అదే బాటలో నడిచాడు. డైరెక్టర్లు అయిపోయాక... డాన్స్ కి కూడా దూరం కావల్సిన పరిస్థితి వచ్చింది. అంత బిజీ అయ్యారు. ఇప్పుడు రాజు సుందరం కూడా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. రాజు సుందరంకి డైరక్షన్ పై ఎప్పటి నుంచో గురి. కొన్నాళ్లుగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఓ కథ రెడీ అయిపోయింది. దీనికి శర్వానంద్ కూడా ఓకే అనేశాడు. త్వరలోనే శర్వా - రాజు సుందరం కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. దీనికి వక్కంతం వంశీ కథ అందించార్ట.
ఈ కథ ఇటీవలే శర్వాకి కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇది వరకు శర్వా కోసం రెండు మూడు కథలు వినిపించాడు రాజు సుందరం. అవేం శర్వాకి నచ్చలేదు. ఈ కథ మాత్రం బాగా పట్టేసిందట. అందుకే వెంటనే ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం మహా సముద్రంలో నటిస్తున్నాడు శర్వా. దాంతో పాటు మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. అవి కూడా పూర్తయిన తరవాతే రాజు సుందరం సినిమా ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.