జాతిర‌త్నంతో వెంకీ

By Gowthami - September 21, 2021 - 15:05 PM IST

మరిన్ని వార్తలు

2021లో అతి పెద్ద హిట్... జాతిర‌త్నాలు. ఈ సినిమాతో న‌వీన్ పొలిశెట్టి రేంజ్ మారిపోయింది. ద‌ర్శ‌కుడు అనుదీప్ కీ భారీ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే నాలుగైదు అగ్ర నిర్మాణ సంస్థ‌ల నుంచి అనుదీప్ కి ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమా ప‌ట్టాలెక్కించ‌లేదు. రెండో సినిమాని ఓ పెద్ద హీరోతో చేయాల‌న్న‌ది అనుదీప్ ప్లాన్‌. ఇప్పుడు ఆ ఛాన్స్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

 

వెంక‌టేష్ కోసం అనుదీప్ ఓ క‌థ సిద్ధం చేశార్ట‌. దాన్ని వెంకీ కూడా ఓకే చేశారని తెలుస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. వెంకీ చేతిలో ప్ర‌స్తుతం దృశ్య‌మ్2, ఎఫ్ 3 చిత్రాలున్నాయి. జ‌న‌వ‌రిలో ఎఫ్ 3 విడుద‌ల కానుంది. ఆ త‌ర‌వాతే.. కొత్త సినిమాని ప‌ట్టాలెక్కిస్తారు. అనుదీప్ ఓ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ సిద్ధం చేశాడ‌ని, ప్ర‌స్తుతం ఆ క‌థపై క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం అందుతోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS