హీరో శర్వానంద్ కొత్త చిత్తం ఆడళ్లు మీకు జోహార్లు సినిమా తిరుపతిలో ప్రారంభం అయ్యింది. చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, హీరో హీరోయిన్ పై ముహూర్తం షాట్ ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్లాప్ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, 14 రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్ ను మేకర్స్ కు అందజేశారు.
నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి.సి బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.