శర్వానంద్‌ పరుగో పరుగు ఎవరికోసం?

మరిన్ని వార్తలు

ఓ పక్క జోరు వర్షం, ఆ వర్షంలో పరుగెడుతోన్న ఓ అందమైన అమ్మాయి, ఆ వెనకే అబ్బాయి పరుగెడుతున్నాడు. ఇదీ పోస్టర్‌. ఇంతకీ ఈ పోస్టర్‌ ఎవరిదా? అనే కదా మీ డౌట్‌. ఆగండాగండి అంత తొందరెందుకండి. అక్కడికే వచ్చేస్తున్నాం. ఆ పరుగెడుతున్న అబ్బాయి పేరు శర్వానంద్‌, మరి పరుగెత్తే అమ్మాయి సాయి పల్లవి అనుకోవాలి. ఎందుకంటే వీరిద్దరూ జంటగా తెరకెక్కుతోన్న సినిమాలోనిదే ఈ పోస్టర్‌. టైటిల్‌ ఇంకా తెలీదు. కానీ తెలిసిపోనుంది. రేపే ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేస్తారట. ఆ విషయం చెబుతూనే ఈ ప్రీ పోస్టర్‌ని విడుదల చేశారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శర్వానంద్‌ తాజా చిత్రమిదే. బేసిగ్గా హను రాఘవపూడి సినిమాలన్నీ కాన్సెప్ట్‌ బేస్‌డే వుంటాయి. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చూశారుగా. క్యూట్‌ లవ్‌ స్టోరీ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ కానీ. అలాగే 'లై' కూడా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీనే. ఆశించిన స్థాయిలో జనాన్ని ఆకర్షించలేకపోయింది. కానీ ప్రీ పోస్టర్స్‌, ప్రీ రిలీజ్‌ ఎట్రాక్షన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో డిజైన్‌ చేసుకుంటాడు హనూ రాఘవపూడి. అలాగే తాజాగా తెరకెక్కుతోన్న శర్వానంద్‌ సినిమాకీ ప్రీ పోస్టర్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్‌ చేశాడు. రేపు టైటిల్‌ లోగో విడుదల కానుందట.

సాయి పల్లవికిది తెలుగులో నాలుగో సినిమా. తొలి రెండు సినిమాలు విజయం మంచి సాధించాయి. మూడో సినిమా అయిన 'కణం' త్వరలో విడుదల కానుంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఇక తర్వాత సినిమా ఇదే. మరో పక్క శర్వానంద్‌ అసలే సక్సెస్‌లతో పరుగు మీదున్నాడు. సాయిపల్లవి కూడా సక్సెస్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌. మరి ఈ కలయికలో వస్తోన్న సినిమా అంటే.. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS