ప్రముఖ సినీ దర్శకుడు బాబీ పై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే, మొన్న అర్దరాత్రి జూబిలీహిల్స్ రోడ్ నెంబరు 33లో తన వోల్వో కారులో ప్రయాణిస్తూ రోడ్డు దాటుతున్న హర్మిందర్ సింగ్ అనే వ్యక్తి కారుని బలంగా ‘డీ’ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్మిందర్ కారులో ఉన్న ఆయన తల్లికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.
ఇక ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే, దర్శకుడు బాబీ కారుని ఆపి ఇదేంటని ప్రశ్నించగా, పక్కనే తన ఇల్లు ఉందని అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పాడు. ఇంతలో అక్కడ స్థానిక ప్రజలు గుమిగూడటంతో బాబీ అక్కడి నుండి కారులో పారిపోయాడని, హర్మిందర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు, దర్శకుడు బాబీ పైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.