శ‌ర్వానంద్ ఇంకా డిసైడ్ అవ్వ‌లేద‌ట‌..

By iQlikMovies - December 16, 2018 - 14:50 PM IST

మరిన్ని వార్తలు

త‌మిళ సూప‌ర్ హిట్ సినిమా '96' రీమేక్‌పై గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. దిల్‌రాజు ఈ సినిమా రైట్స్ చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. హీరో, హీరోయిన్లు ఇంకా ఖ‌రారు కాలేదు. అల్లు అర్జున్‌, నాని, గోపీచంద్ ఇలా కొంత‌మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడు శ‌ర్వానంద్ పేరు వినిపిస్తోంది. శ‌ర్వా అయితే ఈ క‌థ‌కు బాగా న‌ప్పుతాడ‌ని దిల్‌రాజు భావిస్తున్నాడ‌ట‌. శ‌ర్వా డేట్లు దిల్‌రాజు ద‌గ్గ‌ర ఉండ‌డంతో.. ఈ సినిమాలో శ‌ర్వా ఎంపిక దాదాపు ఖాయ‌మైపోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ సినిమాలో న‌టించాలా, వ‌ద్దా? అనే విష‌యంలో శ‌ర్వా ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. ఇటీవ‌ల '96' చూసిన శ‌ర్వా.... ఈ సినిమాపై త‌న నిర్ణ‌యాన్ని ఇంకా దిల్‌రాజుకి చెప్ప‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం.. 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' ప్ర‌మోష‌న్ల‌పై శ‌ర్వా దృష్టి పెట్టాడు. ఈ సినిమాపై త‌న‌కు చాలా ఆశ‌లే ఉన్నాయి. ముందు 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' విడుద‌లై, రిజ‌ల్ట్ వ‌చ్చాక‌... త‌దుప‌రి సినిమాపై నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తానంటున్నాడ‌ట‌. అంటే ఈ సినిమాలో శ‌ర్వా న‌టిస్తున్నాడా?  లేదా? అనేది తేలాలంటే ఈనెల 21 వ‌ర‌కూ ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS