యువ కథానాయకుడు శర్వానంద్ గాయపడిన సంగతి తెలిసిందే. స్కై డైవింగ్ లో శిక్షణ తీసుకుంటున్న శర్వా.. సరిగా లాండ్ అవ్వని కారణంగా గాయపడ్డాడు. ఆ వెంటనే ఆయన్ని హైదరాబాద్ సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం శర్వానంద్ భుజానికి ఆపరేషన్ ప్రారంభిచారు. 11 గంటల పాటు ఆపరేషన్ సాగింది. ఆ వెంటనే శర్వాని డాక్టర్లు ఐసీయూని తరలించారు.
శర్వాకు కనీసం 2 నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. శర్వా `రణరంగం` సినిమా దాదాపుగా పూర్తయిపోయింది. `96` ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. శర్వా గాయంతో... ఈరెండు సినిమాలూ ఆగిపోయినట్టే. శర్వా గాయం నుంచి కోలుకున్న తరవాతే... '96' షూటింగ్ మొదలవుతుంది. శర్వా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని శర్వా సన్నిహితులు తెలిపారు.