'ఆరెంజ్' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో జత కట్టిన బ్యూటీ షాజాన్ పదామ్సీ. తొలి సినిమాకే మెగా కాంపౌండ్ హీరోతో నటించే ఛాన్స్ దక్కినప్పటికీ, ఆ సినిమా విజయం సాధించకపోవడంతో, అమ్మడి గ్లామర్‌కి వేల్యూ లేకుండా పోయింది. ఆ తర్వాత వెంకటేష్ - రామ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'మసాలా' సినిమాలో రామ్‌కి జోడీగా నటించింది. క్యూట్ ఫీచర్స్. డాన్సుల్లో కెవ్వు కేక పుట్టించింది. రామ్‌తో సమానంగా డాన్సులు కూడా ఇరగదీసేసింది. అయినా కానీ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. టాలీవుడ్లో తర్వాత ఆఫర్సేమీ పలకరించలేదు ఈ బ్యూటీని. మోడ్రన్ రంగం నుండి వచ్చిన ఈ బ్యూటీకి సినిమాలే కాదు, ఇతరత్రా వ్యాపకాలు కూడా ఉండడంతో అటు వైపుగా దృష్టి పెట్టింది. మళ్లీ ఈ మధ్యనే సినిమాల్లో నటించేందుకు ఆశక్తి చూపుతోందట. అందుకే సడెన్‌గా ఇలా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. బికినీలో తనలోని హాట్నెస్ అంతా రంగరించి మరీ హీటెక్కించేస్తోంది.