హృద్యమైన కథలకు చిరునామా... శేఖర్ కమ్ముల. చిన్న పాయింట్ ని పట్టుకుని, బలమైన క్యారెక్టరైజేషన్లతో సినిమాని లాగించేయడం శేఖర్ కమ్ములకు బాగా ఇష్టం. ఆయన కెరీర్లో తీసిన పూర్తి సీరియస్ సినిమా `లీడర్` ఒక్కటే. అది పూర్తిగా పొలిటికల్ డ్రామా. ఆ తరవాత.. మళ్లీ.. ఇప్పుడు మరో పొలిటికల్ థ్రిల్లర్ తీయడానికి రెడీ అయ్యాడని టాక్.
`లవ్ స్టోరీ` తరవాత ధనుష్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ధనుష్ నటించే తొలి తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఇది పూర్తిగా పొలిటికల్ టచ్‌తో సాగే సినిమా అట. ఓరకంగా చెప్పాలంటే.. `లీడర్ 2`లా ఉంటుందట. అంటే.. ఇందులో ధనుష్ సీ.ఎం.గా కనిపించడం ఖాయమన్నమాట. ఓ సీరియస్ ఇష్యూని తీసుకుని, కథ రాసుకున్నాడని, సమకాలీన రాజకీయ చిత్రణ.. ఈ సినిమాలో కనిపించబోతోందని, కొన్ని వివాదాస్పద అంశాల్ని శేఖర్ కమ్ముల టచ్ చేయబోతున్నాడన్నది ఇన్సైడ్ టాక్. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది.