ఇంకో గిఫ్ట్‌ రెడీ చేసుకోమంటున్న శేఖర్‌ కమ్ముల.

మరిన్ని వార్తలు

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘లవ్‌ స్టోరీ’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. సాయి పల్లవి ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మ్యూజికల్‌ ప్రివ్యూ పేరుతో ఓ వీడియో ప్రోమోని వాలెంటైన్స్‌ డే సందర్భంగా విడుదల చేసిన విషయం విదితమే. కాగా, షూటింగ్‌ స్పాట్‌లో నాగచైతన్య తనకు గాగుల్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, థ్యాంక్స్‌ చెప్పాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. అక్కడితో ఆగితే ఆయన శేఖర్‌ కమ్ముల ఎలా అవుతాడు.? టీజర్‌ కోసం ఇంకో గిఫ్ట్‌ రెడీ చేస్కో.. అంటూ నాగచైతన్యని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు ఈ విలక్షణ దర్శకుడు.

 

ఇదిలా వుంటే, సినిమా చాలా బాగా వస్తోందనీ, సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌ కట్టి పడేస్తాయనీ, అదే సమయంలో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా అంతర్లీనంగా వుంటుందని తెలుస్తోంది. నటుడిగా నాగచైతన్యను ఈ సినిమా ఇంకో మెట్టు పైకెక్కిస్తుందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ చెబుతున్నాయి. సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పేదేముంది.? శేఖర్‌ కమ్ముల రూపొందించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి, మరోసారి తన కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఈ ‘లవ్‌ స్టోరీ’తో ఇవ్వబోతోంది. మరోపక్క, నాగచైతన్య మేకోవర్‌కి మంచి అప్లాజ్‌ దక్కుతోంది. అతి సాధారణమైన యువకుడిలా నాగ చైతన్య కన్పిస్తుండగా, ఆయన నటన ఈ సినిమాకి మరో హైలైట్‌ అవుతుందన్న ధీమా ‘ఏయ్‌ పిల్లా’ మ్యూజికల్‌ ప్రివ్యూతోనే స్పష్టమయిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS