అంతటా కరోనా భయాలే. స్కూళ్లు, థియేటర్లు, షాపింగు మాళ్లూ మేసేశారు. గుళ్లూ గోపురాల్లోనూ జన సంచారం లేదు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించమని ప్రధాని ఆదేశించారు. అంతటా 144 సెక్షన్ లాంటి వాతావరణం ఉంటే... శేఖర్ కమ్ముల మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. టాలీవుడ్ మొత్తం షూటింగులకు బంద్ ప్రకటిస్తే.. తన సినిమా షూటింగ్ మాత్రం యదేచ్ఛగా సాగుతోందని టాక్. అవును.. టాలీవుడ్‌లో షూటింగులన్నీ బంద్ అయిపోయినా.. శేఖర్ కమ్ముల మాత్రం తన లవ్ స్టోరీ సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ఇది.
ఏప్రిల్‌లో విడుదల కావల్సివుంది. కానీ మేలో వస్తోంది. మేలోనూ ఈ సినిమా విడుదల కావడం కష్టమే అని టాక్. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోతే.. మేలోనూ రానట్టే. అందుకే గప్‌చుప్‌గా ఈ సినిమా షూటింగ్ కొనసాగిస్తున్నాడని, అయితే నాగచైతన్య, సాయి పల్లవి లేని సీన్లే తీస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రపంచమంతా కరోనాకి భయపడుతుంటే శేఖర్ కమ్ముల మాత్రం విచిత్రంగా దాంతో ఎదురీది మరీ పోరాడుతున్నాడు. ఈ టైమ్‌లో ఇంత రిస్క్ అవసరమా??