'ఎ ఫిలిం బై అరవింద్' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు శేఖర్ సూరి. ఈయన దర్శకత్వంలోనే వచ్చిన 'అదృష్టం' సినిమా మాత్రం అంతగా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. అయితే థ్రిల్లర్ సినిమాల పట్ల శేఖర్ సూరికి చాలా ఇష్టం అలాగే కొనసాగుతోంది. ఆ ఇష్టంతోనే 'ఎ ఫిలిం బైర అరవింద్' ఆ సినిమాని హిందీలో రీమేక్ చేయబోతున్నాడట. తెలుగు 'ఎ ఫిలిం బై అరవింద్' సినిమాలో రిషి, మోనా చోప్రా, గజల్ శ్రీనివాస్ తదితరులు నటించారు. అప్పట్లో చాలా పెద్ద విజయం సాధించింది 'ఎ ఫిలిం బై అరవింద్'. 'ఎ ఫిలిం బై అరవింద్' సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన 'అరవింద్-2' మాత్రం ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ దర్శకుడిగా తనకు క్రైమ్ థ్రిల్లర్స్ మీద మోజు తగ్గలేదంటాడాయన. బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న శేఖర్ సూరి, 'ఎ ఫిలిం బై అరవింద్' సినిమాని హిందీలో తెరకెక్కించి తన సత్తా ఏంటో చాటి చెప్తానంటున్నాడు. ఈ సినిమా కోసం మోనా చోప్రా పాత్రలో సన్నీలియోన్‌ని ఎంపిక చేశారట. తెలుగు వెర్షన్‌తో పోల్చితే హిందీ వెర్షన్ టెక్నికల్‌గా ఇంకా హై రేంజ్‌లో ఉంటుందని చెప్పాడాయన. ఎన్నేళ్ళయినా ఏ భాషలో అయినా 'ఎ ఫిలిం బై అరవింద్' ఫ్లేవర్ కొత్తగా ఉంటుందని, సన్నీలియోన్ ఈ సినిమాకి అడిషనల్ గ్లామర్ అవుతుందని శేఖర్ సూరి అంటున్నారు.