'ఎల్కేజీలో కుట్టించావా పాపా ఈ డ్రస్సు మతోయిందంటే ఓ మిస్సు..' అంటూ మెగాస్టార్ పాట గుర్తు చేసుకోవల్సిందే ఈ పిక్ చూస్తే. మన బాస్ లేడీ కాస్తా ఇదిగో బాస్ బేబీగా మారిపోయిందిలా. అఫ్కోర్స్ పాప బర్త్డే లుక్స్ దర్శనాలు కూడా ఆడియన్స్కి సుపరిచితమే అనుకోండి. ఇక తాజాగా ఇదిగో బాస్ బేబీ అంటూ ఈ పిక్ని నెట్టింట్లో వదిలిపారేసింది హాట్ బ్యూటీ షెర్లీన్ చోప్రా. ఇంకేముంది.. బేబీకి రావల్సిన కామెంట్లు.. ఆ రేంజే వేరప్పా. బికినీని తలపిస్తోన్న ఈ డ్రస్సు. పుట్టిన నెల నుండి ఆరు నెలల్లో ఈ డ్రస్ ధరిస్తే బేబీ అంటారు.
నిజమే. కానీ, 'పిందె పండయ్యిందే బొమ్మాలీ..' అంటూ ఇదిగో ఇలా వయసొచ్చాకా ధరిస్తే, దానికే బికినీ అని ముద్దుగా పేరు పెట్టేసుకున్నారు. ఎల్కేజీ పిల్లలు కూడా వేసుకోలేని ఆ నిక్కర్, ఇక టాప్ సంగతి సరే సరి.. ఓ లగ్జరీయస్ కారుకు జారబడి చేతిలో ఓ స్టిక్ పట్టుకుని ఇచ్చిన పోజు చూస్తున్నారుగా. అర్జెంట్ ఏమీ లేదు.. తాపీగా కూర్చొని, నిదానంగా వీక్షించండి.