గ్లామ్‌షాట్‌: న్యూడ్‌ భామ దీవాళీ ట్రీట్‌.!

మరిన్ని వార్తలు

అందాలారబోతలో ఆల్‌ యాంగిల్స్‌ ట్రై చేసేసిన సోషల్‌ మీడియా సెన్సేషన్‌ షెర్లీన్‌ చోప్రా తాజాగా దీవాళీ ట్రీట్‌ ఇచ్చింది. అయితే, రక్షించిందిలే.. ఈ సారి అందాలారబోయలేదు. కానీ, అందంగా కనిపించింది. చీరకట్టుతో మెస్మరైజ్‌ చేసింది. డార్క్‌ కలర్‌ గాగ్రా చోళీ ధరించిన ఫోటో ఒకటి పోస్ట్‌ చేసింది. దాంతో పాటు, లైట్‌ కలర్‌ చీరకట్టులో వయ్యారాలు పోతూ, ఫ్యాన్స్‌కి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

షెర్లీన్‌లోని ఈ కొత్త యాంగిల్‌ చూసి, నెటిజన్లే షాక్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో తనకున్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి ఈ హాట్‌ బ్యూటీ కొన్ని షార్ట్‌ ఫిలింస్‌లో నటిస్తోంది. నటించడమే కాదు, రైటింగ్‌, డైరెక్షన్‌ వంటి టాలెంట్స్‌ కూడా ప్రదర్శిస్తోంది. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. త్వరలోనే ఓ సినిమాకి డైరెక్షన్‌ కూడా చేస్తానంటోంది. తాజాగా షెర్లీన్‌ ఇచ్చిన దీపావళి ట్రీట్‌కి సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS