మెగాస్టార్‌తో 152వ సినిమాని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు దర్శకుడు కొరటాల శివ. స్క్రిప్టు వర్క్‌లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళుతుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాసేపు ఈ సంగతి పక్కన పెడితే, చిరంజీవి సినిమా తర్వాత కొరటాల చేయబోయే సినిమా ఏంటనే దానిపై ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. కొరటాల ఇప్పట్లో మెగా కాంపౌండ్‌ని వదిలిపెట్టేది లేదని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేల్చేశారు. ఇప్పుడు తండ్రితో సినిమాని నిర్మిస్తున్న ఆయన, తదుపరి కొరటాల దర్శకత్వంలో ఆయనే ఓ సినిమా చేయబోతున్నారట. తాజా ఇంటర్వ్యూలో చరణే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతోందట. అంటే వచ్చే ఏడాది జూలై తర్వాత ఈ కాంబినేషన్ మూవీపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే 'ఆర్‌ఆర్‌ఆర్' వచ్చే ఏడాది జూలై 30న 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదలపై ఆడియన్స్‌లో ఎక్కడో చిన్నపాటి అనుమానం ఉంది. ఆగి ఆగి జరుగుతున్న షూటింగ్స్ కారణంగా అనుకున్న టైంకి షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తారా? చెప్పిన టైంకి సినిమా విడుదలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, అనుకున్న టైమ్‌కే షెడ్యూల్స్ కంప్లీట్ అవుతున్నాయట.
చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి షెడ్యూల్స్ సైమల్‌టేనియస్‌గా పూర్తి చేసేస్తున్నాడట జక్కన్న. ఖచ్చితంగా 'ఆర్‌ఆర్‌ఆర్' అనుకున్న టైమ్‌కి విడుదలవుతుందని ఫ్యాన్స్‌లో నమ్మకాన్ని నింపారు రామ్‌చరణ్. అంటే, 'ఆర్‌ఆర్‌ఆర్' కంప్లీట్ కాగానే వచ్చే ఏడాది చరణ్ - కొరటాల సినిమా కూడా పట్టాలెక్కేస్తుందన్న మాట.